"ప్రణవ పంచాక్షరోపనిషత్ర్పపంచంబు(
గడదా(క నెరి(గిన కరతలాని
వాతాపిదైత్యు నిల్లలునితో ( గూడంగ
జఠరాగ్ని వేల్చిన సవన కర్త(
గోపించి నహుషుని( గుంభీనసంబుగా
హుంకార మిచ్చిన యుగ్రతేజు
వానకాలమునా(డు వండు వట్టిననీటి
కాలుష్యముడిపెడు కతకఫలము(
బాండుభసిత వుంద్రాంకఫాలభాగు
భద్రరుద్రాక్ష మాలికా భరితవక్షు"
వింధ్య గర్వాపహారినా పేతజలధి
నయ్యగ స్త్యమహర్షినే నభినుతింతు
(శ్రీ కాశీఖండము)
మన భరత ఖండము పుణ్యతపోభూమి. అటువంటి తపోభూమి యందు ఎందరో తాపసులు జన్మించారు. వారిలో అగస్త్యమహర్షి అగ్రేసరుడు. ఇతడు వశిస్టునకు సోదరుడు. అగతానాగతులు తెలిసినవాడు. సంక్షిప్త అగస్త్య మహర్షి చరిత్ర చదువుకుందాం.
పూర్వకాలమున దేవేంద్రుడు రాక్షసులను సమ్హరింపుమని అగ్నిహోత్రుని, వాయుదేవుని ఆజ్ఞాపించాడు. ఇంద్రుని ఆదేశానుసారం వారిరువురూ రాక్షస సమ్హారం ప్రారంభించారు. ప్రాణభీతితో రాక్షసులు సముద్రమున దాగిరి. సముద్రమునింకించి అందు దాగియున్న రాక్షసులను చంపుడని ఇంద్రుడు పలుకగా సముద్రము నెండగట్టుట వలన అందలి జీవరాశి నశించునని, అది మహాపాపమని వారిని అంతమొందించుటకు మరియొక ఉపాయము ఆలోచించుమని వారిరువులు కోరిరి. అంత మహేంద్రుడు మండిపడి - "అగ్ని, వాయువులారా! నా ఆదేశమును ధిక్కరించిరి గాన మీరిరువురు అచేతన పదార్ధమునుండి మునులై జన్మించి భూమిపై తిరుగుదురు గాక" అని శపించెను.
ఊర్వశి నారాయణుని యూరువునుంచి జన్మించినది. ఆమె సౌందర్యమునకు, సూర్యుడు, వరుణుడు ముగ్ధులైరి. ఊర్వశి సూర్యుడు కోరగా అతనితో పోతూ మనసున వరుణుని పొందు కొరకు తపించసాగింది. అది గ్రహించి సూర్యుడు ఆమెను "భూలోకమున బుధపుత్రుడగు పురూరవునకు పత్నివిగా జన్మించు"వని శపించాడు. శాపగ్రస్తయై ఊర్వశి వెడలిపోయినది.